Ayushman Bharat Card: ఆయుష్మాన్ భారత్ కార్డు తో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స.
- CDVM COMMUNITY
- Feb 14, 2024
- 1 min read

ప్రజల ఆర్థిక పరిస్థితి వైద్యం వల్ల తలకిందులవకూడదని తలంపుతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంతో కలిసి ఆయుష్మాన్ భారత్ కార్డ్ పథకం కింద ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రారంభించింది.
అవసరమయ్యే పత్రాలు
వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉండాలి.
కుటుంబంలో 16 ఏళ్లు పైబడిన ఆదాయం పొందే సభ్యులు ఉండకూడదు.
ఆదాయ ధృవీకరణ పత్రాలు
ఫోటోగ్రాఫ్
క్యాస్ట్ సరిఫికేట్
ఆయుష్మాన్ భారత్ కార్డ్ ప్రయోజనాలు
వివిధ ఆసుపత్రులలో చాలా వ్యాధులు మరియు చికిత్సలకు కవరేజ్.
ప్రవేశ సేవలతో పాటు ఉచిత చికిత్స
రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స.
15 రోజుల ఆసుపత్రి ఖర్చుల కవరేజీ.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా
ఆయుష్మాన్ భారత్ కార్డ్ 2024 యొక్క అధికారిక వెబ్‌సైట్ సందర్శించి, మీకు అవసరమైన పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.
ఏబీహెచ్ నమోదుపై క్లిక్ చేసి, ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించండి.
అనంతరం నమోదు చేయండి.
మీ పేరు, ఆదాయం మరియు పాన్ కార్డ్ నంబర్ వంటి సమాచారాన్ని అందించాలి.
అధికారుల ఆమోదం కోసం వేచి ఉండాలి.ఆ తర్వాత మీరు ఆయుష్మాన్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comentarios