Sanjeevi Nidhi | Visakhapatnam
- CDVM COMMUNITY
- Jan 3, 2024
- 1 min read
CDVM COMMUNITY | News article:
విశాఖపట్నం District Relief fund " సంజీవి నిధి" ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా 14లక్షాలు విరాళాలు జమయింది, కాగా ఈ నిధి కి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున గారు తానే ముందుండి తన నెల రోజుల జీతాని మొదట విరాళంగా అందజేశారు ఆపిమట మిగిలిన ఉద్యోగులు కూడా తమ విరాళాలు అందజేసి ఔదార్యాన్ని చాటారు. ఈ సంజీవి నిధి నీ గత ఏడాది కలెక్టర్ గారు ప్రారంభించారు.
సంజీవని వినియోగం,
అసాధారణమైన, ప్రత్యేక సందర్భాల్లో వైద్య ఖర్చులు, దివ్యాంగులు, బుద్ధిమాంద్యం పిల్లలు, అనాథలు, హెచ్ఐవీ, కుష్ఠు బాధితులు, కొవిడ్ ప్రభావిత పిల్లలకు సహాయం, అనాథలకు ప్రాథమిక విద్య, పేద మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక విద్య, మద్దతు ఇవ్వడం, తదితర వాటి కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. బాధితులు దరఖాస్తులను కలెక్టరేట్ ఆవరణలోని ఫిర్యాదుల విభాగంలో అందజేయాలి. వాటిని పరిశీలించి, విచారణ అనంతరం వారికి కలెక్టర్ ఆర్థిక సహాయం చేస్తారు.
Comments