Kisan Credit Card : కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతులకు చాల ప్రయోజనాలు
- CDVM COMMUNITY
- Feb 24, 2024
- 1 min read
ఈ స్కీం కింద, రైతులు తమ ఆకస్మిక ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి, స్వల్పకాలిక పదవీకాల రుణాలను పొందుతారు.చాలా తక్కువ వడ్డీకి లోన్ పొందుతారు.సాగుదారులుగా ఉన్న అన్నదాతలు, ఉమ్మడి రుణగ్రహీతలు, కౌలు రైతులు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.
స్థానిక బ్యాంకు బ్రాంచిని సందర్శించి అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు, వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్ బుక్ ప్రతి, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్నవారు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు రూ. 50,000 వరకు, రెండవ ప్రమాదంలో రూ. 25,000 వరకు కవరేజీని పొందుతారు.
అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో పాటు పొదుపు ఖాతా కూడా ఇవ్వబడుతుంది, దానిపై వారు మంచి రేట్లలో వడ్డీని కూడా పొందుతారు.ఇంకా దీనితో పాటు వారు స్మార్ట్ కార్డ్ ఇంకా డెబిట్ కార్డ్ కూడా పొందుతారు.
లోన్ తిరిగి చెల్లించడంలో చాలా వెసులుబాటు ఉంది. బ్యాంకుల నుంచి అప్పు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు.ఈ క్రెడిట్ వారి వద్ద 3 ఏళ్ళు ఉంటుంది. రైతులు పంట పండించిన తర్వాత వారి లోన్ ని తిరిగి చెల్లించవచ్చు.మీరు భూమిని కలిగి ఉండి వ్యవసాయం కనుక చేస్తుంటే, అప్లై చేసుకోవచ్చు.
Comments