డిజిటల్ పేమెంట్స్‌కు కొత్త విధానం.. RBI
- CDVM COMMUNITY
- Feb 14, 2024
- 1 min read

డిజిటల్ చెల్లింపుల ధృవీకరణకు ఓటీపీలు ఉపయోగపడుతున్నప్పటికీ మోసగాళ్లకు అవకాశంగా మారుతున్నాయి. దీంతో ఈ విధానానికి చెక్ పెట్టాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ భావిస్తోంది.
డిజిటల్ చెల్లింపుల కోసం ఓటీపీల స్థానంలో అథెంటికేషన్ యాప్‌లు, బయోమెట్రిక్ సెన్సార్‌లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులను మరింత భద్రంగా మార్చచడమే లక్ష్యంగా ఈ దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది. ఈ నూతన విధానం ద్వారా సిమ్ స్వాపింగ్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై హ్యాకర్ల గురిపెట్టకుండా నిరోధించడమే లక్ష్యంగా ఆర్బీఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తే డిజిటల్ చెల్లింపులు మరింత భద్రంగా ఉంటాయని భావిస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే ఎస్ఎంఎస్ ఆధారిత వేరికేషన్ నుంచి అథెంటికేషన్ యాప్‌లకు మారాయి. దీంతో యూపీఐ చెల్లింపుల విషయంలో కూడా ఇలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలని ఆర్బీఐ యోచిస్తోంది.
ఇ-రూపీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్‌లైన్‌లో
ఇంటర్నెట్ అందుబాటులో లేని సందర్భాల్లో కూడా ఆఫ్‌లైన్‌లోనే డిజిటల్ రూపీ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వెసులుబాటు తీసుకురానుంది ఆర్బీఐ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విధానం వినియోగించుకోవచ్చని చెప్పారు శక్తికాంత దాస్. ఈ ఆఫ్‌లైన్ మోడ్‌ను కొండలు, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షిస్తామని తెలిపారు.
Comments