top of page

ఉచిత విద్యుత్‌ పథకం.. 'రూఫ్‌టాప్‌ సోలార్‌' కోసం దరఖాస్తు

సౌర విద్యుత్‌ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా 'పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana)' పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.


ఈ స్కీమ్‌తో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తు ప్రక్రియ ఇలా..


Step 1:ముందుగా ఈ పోర్టల్‌లో మీరు పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. ఇందుకోసం


మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.

మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయాలి.

పోర్టల్‌లో ఉన్న నియమ నిబంధలను అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.


Step 2: ఆ తర్వాత కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. అక్కడ 'రూఫ్‌టాప్‌ సోలార్‌' కోసం అప్లై చేసుకోవాలి.


Step 3: దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి


Step 4: ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన తర్వాత, ఆ ప్లాండ్‌ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.


Step 5: నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.


Step 6: ఈ రిపోర్ట్‌ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది

Comments


Innovation

CDVM Community strongly believes in fostering innovation and supporting ideas that have the potential to make a positive impact on society.

Promotion

CDVM Community is dedicated to promoting local businesses and supporting the craftsmanship of handmade products.

News

CDVM Community takes pride in its role as a reliable source of local news and useful information for the community.

Consulting

CDVM Community is dedicated to providing consulting and contact support services with the aim of uplifting society.

© 2024 by CDVM COMMUNITY |  Terms of Use  |  Privacy Policy

bottom of page